Puri JagannadhPuri Jagannadh: సినిమా పోతే నమ్మినోళ్లు కూడా రివర్స్ అవుతారు.. ‘లైగర్’ ఫ్లాప్‌పై పూరి రియాక్షన్

పూరి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ లైగ‌ర్‌. భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా రిలీజై డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ సినిమా త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ మీడియాకు చాలా దూరంగా ఉన్నారు. రీసెంట్‌గా చిరంజీవితో గాడ్ ఫాద‌ర్ సినిమా స‌క్సెస్ సంద‌ర్భంగా జ‌రిగిన లైవ్ వీడియో ఇంట‌ర్వ్యూలో పూరి మాట్లాడే సంద‌ర్భంలో సినిమా ఫ్లాప్‌ను ఎలా తీసుకుంటావు అని పూరిని లైగ‌ర్ సినిమాను ఇన్‌డైరెక్ట్‌గా ఉద్దేశించి పూరిని ప్ర‌శ్నించారు చిరు. దానికి పూరి రియాక్ట్ అవుతూ..

ఉన్న విష‌యాన్ని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పే వాళ్లలో స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఒక‌రు. ఆయనే కాదు.. ఆయ‌న సినిమాలు, అందులోని డైలాగులు కూడా అంతే సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. ఈ డైరెక్ట‌ర్ లేటెస్ట్ మూవీ లైగ‌ర్‌. భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా రిలీజైన లైగ‌ర్ (Liger) డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ మీడియాకు చాలా దూరంగా ఉన్నారు. రీసెంట్‌గా చిరంజీవి (Chiranjeevi)తో గాడ్ ఫాద‌ర్ (GodFather) సినిమా స‌క్సెస్ సంద‌ర్భంగా జ‌రిగిన లైవ్ వీడియో ఇంట‌ర్వ్యూలో పూరి మాట్లాడారు. ఈ సంద‌ర్భంలో సినిమా ఫ్లాప్‌ను ఎలా తీసుకుంటావు అని పూరి జ‌గ‌న్నాథ్‌ను లైగ‌ర్ సినిమాను ఇన్‌డైరెక్ట్‌గా ఉద్దేశించి పూరిని ప్ర‌శ్నించారు.

ఆ ప్ర‌శ్న‌కు పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ ‘‘సక్సెస్ వస్తే చాలా ఎనర్జీ వ‌స్తుంది. అదే ఫెయిల్యూర్ వ‌స్తే ఉన్న ఎన‌ర్జీ పోతుంది. స‌క్సెస్ వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌మొక జీనియ‌స్‌లాగా క‌నిపిస్తాం. అదే ఫెయిల్ అయితే ఫూల్‌లా క‌నిపిస్తాం. సినిమాకు ప‌ని చేసిన‌వాళ్లు, న‌మ్మినోళ్లు కూడా రివ‌ర్స్ అవుతారు. ర‌క ర‌కాల ఇబ్బందులుంటాయి. చాలా ప్రెష‌ర్స్ వ‌స్తాయి. ఆ స‌మ‌యంలో స్ట్రెంగ్త్ ఉంటేనే ధైర్యంగా ముందుకు వెళ్ల‌గ‌లుగుతాం. ఏదైనా దెబ్బ త‌గిలిన‌ప్పుడు ఓ హీలింగ్ టైమ్ ఉంటుంది. ఆ టైమ్ త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. ఆస్తులు పోవ‌చ్చు, యుద్ధాలు జ‌ర‌గొచ్చు..అయితే ఎన్ని జ‌రిగినా హీలింగ్ టైమ్ ఒక నెల కంటే ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు. మ‌ళ్లీ నెక్ట్స్ ప‌ని చేసుకోవాలంతే. లైగ‌ర్ సినిమా చేసే ప్రాసెస్‌లో నేను మైక్ టైస‌న్‌తో షూటింగ్ చేయ‌టం, మంచి సెట్స్ వేసి వ‌ర్క్ చేశాం. మూడేళ్లు ఎంజాయ్ చేశాను. అయితే ఫెయిల్యూర్ వ‌చ్చింది. అది మ‌న చేతిలో లేదు. దానికి మ‌రో మూడేళ్లు ఏడ‌వ‌లేం క‌దా’’ అన్నారు.
పూరి జగన్నాథ్ చెప్పిన ఫిలాసిఫికల్ ఆన్స‌ర్‌కి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయిపోయి.. సూప‌ర్బ్ ఆన్స‌ర్ అనేశారు. అలాగే ఆటోజానీ సినిమా గురించి కూడా వారి మ‌ధ్య డిస్క‌ష‌న్ జ‌రిగింది. త‌నతో డైరెక్ట్ చేయాల్సిన‌ ఆటోజానీ స్క్రిప్ట్‌ను ఏం చేశావ‌ని పూరి జ‌గ‌న్నాథ్‌ని చిరంజీవి అడిగిన‌ప్పుడు ‘దాన్ని ప‌క్క‌న ప‌డేశాను సార్‌. దాని కంటే మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను. అది పూర్తి కాగానే త‌ప్ప‌కుండా క‌లుస్తాను’’ అని అన్నారు. తప్పకుండా రా.. కలిసి సినిమా చేద్దామని చిరంజీవి కూడా పూరితో అన్నారు.

Puri Jagannadh: If the movie goes, even the believers will reverse.. Puri’s reaction on the flop of ‘Liger’ The latest movie directed by Puri is Liger. Released as a Pan India movie with huge expectations, it turned out to be a disaster. After that movie, Puri Jagannath stayed away from the media. In a recent live video interview with Chiranjeevi on the occasion of the success of the movie Godfather, Chiru asked Puri indirectly addressing the movie Liger, how do you take the flop of the movie while talking about Puri. Star director Puri Jagannadh is one of those who say that Puri’s reaction is to break the matter. Not only him.. His films and the dialogues in them are also straight and without hammer. This director’s latest movie is Liger. Liger, which was released as a Pan India movie with huge expectations, turned out to be a disaster. After that movie, Puri Jagannath stayed away from the media. Recently, Puri spoke in a live video interview with Chiranjeevi on the occasion of the success of the movie Godfather. In this context, Puri asked Jagannath how he would take the film’s flop, indirectly referring to the film Liger.

To that question, Puri Jagannadh said, “Success brings a lot of energy. If the same failure occurs, the existing energy will be lost. When success comes we look like geniuses. If the same fails, we will look like a fool. Those who worked for the film and those who believe it will also reverse. There are different types of problems. A lot of pressures come. Only if we have strength at that time, we will be able to move forward with courage. Any damage has a healing time. Make sure that time is short. Property may be lost, wars may take place… but no matter what happens, the healing time should not be more than one month. Let’s work next again. In the process of making the film Liger, I was shooting with Mike Tyson and we worked on good sets. I enjoyed it for three years. But there was a failure. It is not in our hands. “Can’t we cry for another three years?” he said. Megastar Chiranjeevi got fed up with Puri Jagannath’s philosophical answer and said it was a superb answer. Also, there was a discussion between them about Autojani movie. When Chiranjeevi asked Puri Jagannath what he did with the Autojani script that he was supposed to direct, he said, ‘I threw it aside, sir. I am preparing a better script than that. I will definitely meet you when it is done,” he said. Chiranjeevi also said that he should come.. let’s make a film together.

source

Leave a Comment

  −  6  =  3